నా మనసు కవిత
నా మనసు కవిత
అక్షరాలను రాశులుగా పోసి
అందమైన పదాలతో పొందుపరచిన
భావతరంగమే నా భావ కవిత
మనసులో ప్రియ భావాలను
ప్రణయ కావ్యాలుగా మార్చే
ఊహకు రూపమే నా ప్రియ కవిత
ఒంపుసొంపుల సోయగాలను
అందంగా అభివర్ణించే రంగులచిత్రమే
నా అందమైన కవిత
ఏ తోడు నోచుకోని ఒంటరి పయనం లో
నీడనిచ్చే పూల చెట్టే
నా చల్లని కవిత
అలసి సొలసి గాయపడిన హృదయానికి
ఓదార్పునిచ్చే మధురకావ్యం నా హృదయ కవిత
మదిలో తలపులన్ని పూవులుగా విరబూసి
పరిమళించేదే నా మది కవిత
అందమైన ఆలోచనలకు రూపమిచ్చేదే
నా రూప కవిత
మది కడలిలో ఎగసే భావతరంగాలు
పురుడు పోసుకుని..... రూపం ఇస్తే
అదే నా మనసు కవిత...
... సిరి ✍️❤️

