నా కిష్టం
నా కిష్టం
ఎదను గాయ పరచిననూ నువ్వంటే నాకిష్టం
కలిమి కరిగి పోయిననూ నువ్వంటే నాకిష్టం
ప్రేమపిచ్చి ముదిరిపోయి నాలోనే నవ్వుకున్న
ఉన్మాదిగ మారిననూ నువ్వంటే నాకిష్టం
రేయిపవలు నీనామం స్మరియిస్తూ ఉన్నానూ
ఇంటివారు గెంటిననూ నువ్వంటే నాకిష్టం
ఇన్నాళ్లూ ఎదురుచూస్తి ఇంకనీవు రావంటివి
కాలంకాటేసిననూ నువ్వంటే నాకిష్టం
నీవులేని నాజన్మము ఇంకెందుకు అనుకున్నా
శ్వాస ఆగిపోయిననూ నువ్వంటే నాకిష్టం
