నా జీవనగమ్యం
నా జీవనగమ్యం
నా జీవన గమ్యం
నీవు నా కనుల వెలిగే
నవ దీపానివి.
నీవు నా పెదవిపై కదిలే
నవ నాదానివి.
ఈ తోట పూలలోన నిలిచే
నీ మేను సొగసు.
ఈ తేటి పాటలోన విరిసే
నీ తీపి రాగము.
నీవు నా హృదయ భావన
నీవు నా ప్రణయ వేదిక
నీవు నా కవన మాలిక
నీవు నేనేగా.......
నేను నీవేగా......
నీవు నా ఇంట అలరారు
ప్రభాత కిరణానివి
నీవు నా కంట నడుయాడు
ప్రకృతి తరంగానివి
నీవు నా కళల కళ్యాణివి
నీవు నా ప్రణవ వేదానివి
నీవు నా జీవన గమ్యానివి
నీవు నేనేగా....
నేను నివేగా...
నేను నీవేగా....
నీవు నేనేగా....
డాక్టర్. కొండబత్తిని రవీందర్.