నా ఆవేదన
నా ఆవేదన
రెక్కలు కట్టుకుని వాలాలనివుంది...
నీకు నచ్చినవన్నీ చెయ్యాలనివుంది...
నీఎదనే నాగూడుగ మార్చుకోవాలనివుంది...
నీమనసే పంచుకోవాలనివుంది...
నేనే నువ్వనే నిజమే నీకు చెప్పాలనివుంది...
నాతనువే చలనం కోల్పోయింది...
నాప్రాణం నీశ్వాసలో ఎప్పుడో కలిసిపోయింది..
అర్ధించానే కానీ ఏనాడన్నా హక్కు చూపించానా
విన్నవించానే కానీ వారించానారాసుకుని మురిసిపోతానే
కానీ రాలేదని అలిగానా మనసున నిలిపానే కానీ నన్నేలుకోగ పిలిచానా....
నేనేమడిగాను నిన్ను మేడలు మిద్దెలూ కావాలన్నానా...
మణులు మాణిక్యాలూ తెమ్మన్నానా గొంతెమ్మ కోరికలే కోరానా...
ఎప్పుడూ కళ్లముందే ఉండమన్నానా కావలి కాయమన్నానా...
కోపమే చూపుతున్నానా కాసింత సమయమేగా ఇవ్వమన్నాను...
కొయ్యనే చేసేశావు రాయిలా మార్చేసావు రోతలా మిగిలున్నాను...
... సిరి ✍️❤️

