STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మూగ పోయిన మనసు

మూగ పోయిన మనసు

1 min
318


నిన్ను తలచు రాత్రంతా యుగంలాగ గడిచింది 

నిన్ను వెతుకు సమయంలో నాబ్రతుకే ముగిసింది 


ఎన్ని జన్మలెత్తినా నిన్నే కోరుకుంటాను 

ఈ జన్మలొ నిన్ను చేరు ఆశ అణగి పోయింది 


ఇప్పటికీ నీపిలుపే చెవిలొ గింగురంటుంది 

పిలిచి పిలిచి అలసిపోయి గొంతు మూగ బోయింది 


చేయిపెట్టి వెతికినసరె హృదయమంత శూన్యమే 

నిన్ను విడిచి నామనసే మరలతిరిగి రానంది 


కళ్ళల్లో వత్తులేసి కాచుకొన్నాను "చల్లా"

నిరాశనే చిరుగాలీ దీపమార్పి పోయింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance