STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

మర్యాద

మర్యాద

1 min
1

మర్యాదను మర్యాదగ..కాపాడుట మర్యాద..!

సంస్కారపు గంధాలను..వదిలేయుట మర్యాద..!


ఎంత రామచంద్రుడైన..మన్నించె గురువాక్యం..

తన ధర్మము తెలిసిసరిగ..పాటించుట మర్యాద..!


ఎవరెవరికి నేర్పలేరు..ఏ మనసును బంధించి..

సత్యమెరిగి శాంతముగా..మాటాడుట మర్యాద..!


మనసుపడే ముచ్చటయే..వికారాల జాతరోయ్.. 

పరిమళించు మల్లియలా..జీవించుట మర్యాద..! 


ఏ గులాబి పూవైనా..రాలి మట్టి కలియునా..

రాజసమది ఎంతైనా..విడనాడుట మర్యాద..!


తలిదండ్రుల గౌరవించు..బిడ్డలెంత ధన్యులో..

పెత్తనం చెలాయించక..మసలుకొనుట మర్యాద..!



Rate this content
Log in

Similar telugu poem from Classics