STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Others

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Others

మరిచిపోకు ప్రియతమా!

మరిచిపోకు ప్రియతమా!

1 min
364


నేస్తమా,


నీ ఆలోచనల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను.

నీ విరహపు జ్వాలలో పడి కాలి పోతున్నాను.

నీ మౌనపు మనసులో నేనొక శిలనౌతున్నాను.

నీ ఆరాధన భావంలో ఆవిరవుతున్నాను..

ఎంత కాలం ఇలా ఉండిపోను..

ఎన్ని విరహగీతాలు నీకోసం రాసుకోను..


ప్రియా,

ఒకసారి ఒచ్చిపో చిరుగాలిలా నాకోసం ,

ఆగిన ఊపిరి అందుతుందేమో..

ఒకసారి చల్లిపో నీ మాటల చినుకులు నాపై.

పుడమిలా పులకరిస్తానేమో...

ఒకసారి కురిపించిపో నీ చూపుల వెన్నెల నాపై,

కలువలా వికసిస్తానేమో..

ఒకసారి ఆలింగనం చేసుకో నన్ను ,

ఆగిన హృదయం స్పందిస్తుందేమో..

ఒకసారి నవ్విపో నాతో కలిసి ...

కన్నీటి దొంతరలు కరిగిపోతాయేమో..


మరిచిపోకు నేస్తమా. నా ప్రాణం నీదేనని 

మరువబోకు ప్రాణమా నా జీవిత గమ్యం నీవేనని..


శ్రీ....

హృదయ స్పందన.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics