మరి అదే బుద్దుడంటే!
మరి అదే బుద్దుడంటే!
మొహంలో తేజస్సు
కళ్ళల్లో నిశ్చలత్వం
నవ్వుల్లో స్వచ్ఛత
బుద్దిలో స్థితప్రజ్ఞత
మరి అదే బుద్దుడంటే
బుద్దుడంటే భారత ఖ్యాతి!
అసియఖండపు జ్ఞానజ్యోతి!
అనురాగం, ద్వేషం
అనందం, విషాదం
జయాపజయాలు
కలిమిలేముల
సమ స్వీకరణకు
సమ బుద్ది ఉండటం
మరి అదే బుద్ధిజం అంటే!
రాజ్యాన్ని త్యజించాడు
ఐహిక భోగాలను వద్దనుకున్నాడు
భార్య పిల్లలను విడిచాడు
సర్వసాన్ని పరిత్యజించాడు
మరి అదే మహాభినిష్క్రమణ అంటే!
అరణ్య సాధువులని ఆశ్రయించాడు
ఆధ్యాత్మిక కేంద్ర గురువులను ప్రశ్నించాడు
తెలుసుకున్నవన్ని అహేతువాదా సిద్ధాంతాలన్నాడు
మనోజయమే...మహాజయం అనుకోని
భోది వృక్షం నీడలో బుద్ధుడయ్యాడు
మరి అదే ధర్మచక్ర పరివర్తనమంటే!
యవ్వనం అశాశ్వతం
రాగబంధాలు అశాశ్వతం
అధికారాలు అశాశ్వతం
సంపదలు అశాశ్వతం
మరి అవే దుఃఖనికి కారణలంటే!
సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం
సమ్యక్ వాక్కు, సమ్యక్ ప్రవర్తన
సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం
సమ్యక్ జాగ్రత్త, సమ్యక్ ధ్యానం
మరి అదే అష్టాంగ మార్గమంటే!
గుడ్డి నమ్మకాలను వదలమ్మన్నాడు
గురువులయిన బోధకులైన
అంతర్మధనం తప్పదన్నాడు
అనుభవంతో పరమ సత్యమన్నాడు
మరి అదే బౌద్దంలో మానవుడే సర్వశక్తిమంతుడంటే!
కుల, వర్గ, వర్ణం
లింగ, జాతి,మత
వివక్షలేని సమాజం కోసం
పరివ్రాజకుడై భోధించెను
మరి అదే ధర్మభోదంటే!
ఆత్మ పరమాత్మ కర్మ లేని
హేతు బద్ధమైన మార్గం
పూజ పునస్కారాలు లేని
నైతిక శిక్షణ, నీతి బాట
శూద్రులకు, స్త్రీలకు, అన్యులకు
మనుష్యులందరికి సమానత్వం
మరి అదే బౌద్ధమత సారామంటే
నా మీద భక్తితో నా మాటలను
యధాతదంగా స్వీకరించ వొద్దు
హేతుబద్దత, శాస్త్రీయత
సమత పరిమళాలు బౌద్ధధర్మం
ప్రపంచ మతాలలో ఆలోచన
స్వేఛ్చను బౌద్ధమతం ఇచ్చింది
మరి అదే బుద్ధిహీనులకు
బౌద్ధంలో చోటు లేదంటే!
