STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

మృగశిరకార్తె

మృగశిరకార్తె

1 min
2

మృగశిరకార్తె 


(కవిత )


మురిపించు మేఘాలు భువిపైన వాలంగ

ధరణితా పులకించ తరువులే పొంగంగ

వచ్చె మృగశిరకార్తె పవనాళి దరిచేర

స్వచ్ఛమౌ జలముతో జగతిదాహము తీర

హలములకు రైతులట హారతుల నీయంగ

పొలములకు మళ్లుతూ భువి దుక్కి దున్నంగ

గోవులను పూజించి కొలిచిరా సైరికులు 

చేవతో పండించ జీవమిడు సస్యములు 

ఋతువులలో మార్పులు రేయింబవళ్లులుగ 

జతగూడి పయనించ జగంబుకు మేలిడగ

పిల్లపాపలు మురిసి వేడ్కగా విలసిల్ల

చల్లగా సాగుతూ జాతులే వర్థిల్ల

జనుల హృదయాలలో సరాగాల సవ్వడులు 

ఘనతరంబుగ మ్రోగ కనుపించు స్వర్గములు //




Rate this content
Log in

Similar telugu poem from Classics