STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

మొదటి సారి..

మొదటి సారి..

1 min
336

మొదటిసారి చూసినపుడే మోహం చిగురించింది

ఎదుటపడి చెప్ప లేకనే ఎద ఒకటే కలవరించింది

దివినుండి దిగివచ్చిన దివ్యమోహనం ఆ రూపం

ఏ కవినుండి ఆశించని అందమైన మది కలాపం

తీరు తెన్నులు తీయని పలుకులకే పరవశం కదా

జోరు వన్నెలు జోరైన చూపులే వనితావశం కాదా

మొదటిసారి చూసినపుడే మోహం చిగురించింది

ఎదుటపడి చెప్ప లేకనే ఎద ఒకటే కలవరించింది


సృష్టిలో తీయనైనది తీరైన ఆ స్నేహమొక్కటేనా

సంతుష్టిలో ప్రేమనే మించినదీ ఉన్నదా ఎక్కడైనా

సృష్టిలో తీయనైనది తీరైన ఆ స్నేహమొక్కటేనా

సంతుష్టిలో ప్రేమనే మించినదీ ఉన్నదా ఎక్కడైనా

ఆమని పులకించి ఆశలూ ఆ ఎడదలో పెంచాకా

రమ్మని పిలిపించే సౌందర్యమే మది రగిలించాకా

కనిపించే దేహానికి కనిపించని ఊసుల సందోహాం

మరిపించే మనసులో మరపు లేని ఊహా దాహం

మొదటిసారి చూసినపుడే మోహం చిగురించింది

ఎదుటపడి చెప్ప లేకనే ఎద ఒకటే కలవరించింది

దివినుండి దిగివచ్చిన దివ్యమోహనం ఆ రూపం

ఏ కవినుండి ఆశించని అందమైన మది కలాపం


ఇక

రెండు ఒడ్డులా మధ్య ప్రవాహంలా ప్రేమే సాగాలి

పండు హృదయాలా పండుగై ఒరుసుకు సోగాలి

రెండు ఒడ్డులా మధ్య ప్రవాహంలా ప్రేమే సాగాలి

పండు హృదయాలా పండుగై ఒరుసుకు సోగాలి

మొదటిసారి చూసినపుడే మోహం చిగురించింది

ఎదుటపడి చెప్ప లేకనే ఎద ఒకటే కలవరించింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance