STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసులో

మనసులో

1 min
238


గగనమే ప్రేయసై..నిండెనా మనసులో..!

చెలిమియే వెన్నెలై..ముసిరెనా మనసులో..!


పరువమే మూగదై..పాఠమే నేర్పెలే..

భావమే మేఘమై..సాగెనా మనసులో..!


భాషలే యేఱులై..హృదయమే చుట్టెలే..

రాగమే కావ్యమై..పొంగెనా మనసులో..!


మోహమే మాయమై..సరసమే వెలిగెలే..

భోగమే యోగమై..విరిసెనా మనసులో..!


సాధనే మోదమై..భాగ్యమే నిలిపెలే..

గంధమే లాస్యమై..ఊరెనా మనసులో..!


కల్పనే కల్పమై..కథనమే నడిపెలే..

బంధమే కాలమై..రాలెనా మనసులో..!


మనసు గీతయే..మార్గమే చూపెలే..

మౌనమే చిత్రమై..మిగిలెనా మనసులో..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance