STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు తోటకు విచ్చేసిన నేస్తమా

మనసు తోటకు విచ్చేసిన నేస్తమా

1 min
356

కనులు మూసినవేళ కలలో నీవే కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే


మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే


చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమయ్యేదీ నీవే అలసిపోయి నే నిలబడితే రారమ్మని పిలిచేదీ నీవే


నాలోని ప్రేమ భావనకు పునాది నీవే ఆ ప్రేమే నన్ను దహించేస్తుంటే చూస్తూ నవ్వుకునేదీ నీవే


మూగబోయిన నాలోని భావానికి అక్షరరూపం నీవే అల్లుకున్న అక్షరాలను కవితలుగా ఏర్చి కూర్చిందీ నీవే


నేనంటూ బ్రతికున్నానంటే దానికి కారణం నీవే ఏనాడైనా నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance