STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు పూలు

మనసు పూలు

1 min
344

మందబుద్ధి ఎవరికందం..మందగమనం మగువకు..! 

ఎంతమహా సింహమైనా..పోదూరకే తెగువకు..!


రాలు ఆకు కోరికేమో..ఎవరితరమో తెలియగ..

కోర్కెలన్ని రాలిపోవా..'శ్వాసమీద'నె చూడగ..! 


'దోహా'యనగ దోశలా..వేసేదంటే చాలు..!

తాత్వికతయే నింపాలా..లేవే చంచాలు..! 


తపమున మున్గగ తెలియునా..తాపమునే వీడక..! 

ప్రేమవిలువే అందేనా..తృప్తి శిఖరమై ఉండక..!


నీడతోటి గొడవలోనే..నీడపట్టుకు పుట్టుట..! 

'నేను'స్పృహనే అందకే..భయములోపడి గిట్టుట..! 


'నేను సరి' అనుకున్న సరే..'నేనే' సరితో గొడవ..! 

ఎవ్వరి బతుకైనా సరే..కడలిన పూవుల పడవ..! 


రెప్పల చాటు పాపలతో..సంభాషణ మురిపించును..! 

మాటలకందని మౌనమే..గగనాలను దాటించును..! 


ఊర్కే మాటలు దేనికోయ్..ఉండి చూడు మౌనముగ..! 

వెలుగు దారిగమారు కదా..వెన్నంటిన నేస్తముగ..! 


సేద్యం చేస్తే లాభమే..ఉండదంటే వినడులె..! 

అన్నం పెట్టు అమ్మకదా..నేలతల్లి బిడ్డడులె..! 


ఓపికంటే ఏంటంటే..అందదు చూడు తూచగ..! 

ఆకాశం ఉన్నది కదా..'మాధవ'నిధిగ ఎంచగ..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance