STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు పలికే భాష్యం

మనసు పలికే భాష్యం

1 min
204

మాసిపోని నీ మమతల గంధం

నా ఎద పొంగేను వలపు సుగంధం


వెన్నెల రాత్రిలో మల్లెల రాగం

హృదిలో నీ తలపుల సరాగం


 కన్నుల లోగిలిలోనీ కలలజాగారం

మది లోగిలిలో నీ రూపం సాకారం


ఎందుకో తెలియని ఆరని తాపం

నీకై ఎదురుచూపుల నిరీక్షణ దాహం


నిను చూడని క్షణమే నాకొక యుగం

నిను చేరని దూరం నాకేంతో నరకం


నీ జ్ఞాపకాల విరులే నా మకరందం

నీ చిరునవ్వుల వెన్నెలే విరిసిన వసంతం


 నీ చిరు పలకరింత నా ఎదలో పులకింత

నీపై ధ్యానమే నను వీడని కలవరింత


 నీ కనుల కౌగిలిలో నే నా కాపురం

నువ్వునా జీవనాధారపు ఇరిగిపోని సౌరభo


 పెనేసిన మనమనసుల్లో నిత్యప్రేమ వాసంతం మాసిపోక మలిగిపోక నిత్యమైనిలిచేగా అనుబంధం


నీ ప్రేమవాహిని రుచిని చవి చూసి

మనసుపలికే మధురభావ భాష్యం



Rate this content
Log in

Similar telugu poem from Romance