STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు పాట

మనసు పాట

1 min
348

మనసు పాట పాడుతున్న..కోకిలనే చూస్తున్నా ..!

చినుకుపూల తోటసాక్షి..చంద్రికనే చూస్తున్నా..! 


హద్దెరుగని ఆశ ఒకటి..అల్లుకుంది ప్రాణాలను..

చూడతీపి గంధవనపు..ఊయలనే చూస్తున్నా..! 


కలతపెట్టు కలలలాగ..మరువలేని జ్ఞాపకాలు..

రాలుతున్న వసంతాల..ముచ్చటనే చూస్తున్నా..! 


ఏకాదశి వ్రతమంటే..నిజ ఏకాంత వాసమే.. 

ప్రతిరోజు పండుగంటి..వేడుకనే చూస్తున్నా..! 


నేనన్నది విశ్వవ్యాప్త..కాంతిశక్తి ప్రవాహమే.. 

జ్ఞానధార ప్రసాదించు..దేవతనే చూస్తున్నా..!


Rate this content
Log in

Similar telugu poem from Romance