STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు మల్లెనమైతే

మనసు మల్లెనమైతే

1 min
227


యుద్ధకాంక్ష లేనినాడు..యోధులతో పనేముంది..! 

మనసు మల్లెవనమైతే..పూవులతో పనేముంది..! 


ఉన్నారా ఎవరైనా..కురుస్తున్న మేఘంలా.. 

పంచిపెట్టు గుణముంటే..పదవులతో పనేముంది..! 


గురువెవరో శిష్యులెవరొ..తెలుసుకున్న వారెవ్వరు.. 

సత్యమేదొ అందిందా..చదువులతో పనేముంది..! 


కన్నులింటి వెలుగుపంట..దాచిపెట్ట వీలగునా.. 

తపములోన మునిగినంత..తగవులతో పనేముంది..! 


మధురమైన భావనయే..కరువైతే మనిషెక్కడ.. 

వెతుకులాట ముగిసిందా..మధువులతో పనేముంది..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance