మనసు కల
మనసు కల
అదృష్టదేవత
కోరి వరమిచ్చినదో ఏమో!
ఓ ప్రియా
నాకోసమే నీవు పుట్టావేమో!
ఏమో అది ఏమో
ఆ కనుసైగలకర్ధమదేమో
కనురెప్పల దోషమదేమో!
వెన్నెలలో లేదులే
అగుపించక పొదులే
చీకటిలో లేదులే
వెలుగురవ్వ ఆమెలే
ఏ చోట దాగేనో
అందాల బొమ్మ
ఎంతవెతికినా దొరకని
సోయగాలరెమ్మ
పసిడి అంచు చీరకట్టి
సైగ చేసి పోయెను
పలుకరింప జూచుసరికి
అగుపించక పోయెను
రాత్రి కలలో కనిపించిన నిచ్చెలి
చిరునవ్వుల వెన్నెల కాంతిని
మెరిసే తారలనడుమ నిలుచుని
మరీ మరీ చూడాలని కోరుతున్న
మనసు కలలకు ఆహా! ఓహో!
అనకుండా వుండలేక పోతున్నా
ఓ ప్రేయసీ ఓ సారి కనిపించి పో...

