STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు గులాబీ 🌹🌹

మనసు గులాబీ 🌹🌹

1 min
308


అందమైన గులాబీని 

తడమని హాస్తమేది

సొంతం కావాలని 

కాంక్షించని మనసేది

అందమైనదే అయిన 

సులభంగా అందనిది

పరిమళభరితమైనదే అయిన

తనని తుంచాలని చూస్తే 

ముళ్ళతో గాటు చేయని సంధర్భమేది

అందమైన గులాబీ వంటిదే 

మంచి మనసున్న మనిషి వ్యక్తిత్వం

ఆ మంచిని తుంచాలంటే 

అదొక సాహసమే మరి

ఆ మంచితనాన్ని అలవరచుకోవాలంటే 

సమాధానం సహనమే 

ముళ్ళ కంపకే అందం ఎక్కువ

మంచితనానికే పరీక్షలెక్కువ

జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా 

మంచే గెలుస్తుంది

తన మంచి మనసు పరిమళాన్ని 

చుట్టూరా వెదజల్లి మరి...



Rate this content
Log in

Similar telugu poem from Romance