STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనస్సుకి

మనస్సుకి

1 min
255

మనస్సుకీ సంకేతాలేందుకో.!


అర్థంకాక తెగ ఆయాసపడుతుంది.


ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!

ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలను

మిగల్చ బోతుందా.!


వడిసి పట్టుకోనా, లేక

వదులుగా పట్టి చేజార్చుకోనా.?


తెలియదు.!

తికమక పడుతూ ఆలోచనలు అడుగులేస్తున్నవి

తడబడితే ఓ పోరపాటుగా ఇది మిగిలిపోతుందని


వద్దు...

మానుగా ఎదగలేని విత్తుకి చిగురులెందుకు

క్షణం కునుకు తియ్యలేని కంటికి రెప్పలెందుకు


మనస్సుకి సర్ది చెప్పి

మౌనంగా పక్కకు జరిగిపో


చల్లదనం తగిలిన

మేఘంలా కరిగిపో


తెల్లవారు జామున

చందమామ వెలుగులా వెలిసిపో


కానీ అంత నీ ప్రేమ బుటకం

 నీ స్వార్థం నీదే నీకు అక్కర్లేని ప్రేమ నాకు ఎందుకు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance