మనసాయే
మనసాయే
విహంగమై వినువీధిన విహరించగ మనసాయే
తరంగమై జలనిధిలో ఉప్పొంగగ కోరికాయె
తురగమునై భువిపైనా పరుగులిడా తపనాయే
నినుచూసిన తరుణములో పరవశించి మదిపాడే
ఇరువది నాలుగు ప్రాయము నీకొచ్చిన పిదపనేను
మేనమామ కూతురైన నినుగంటిని తొలిసారిగ
నీఅందం నీచందం మురిపించెడి కౌమారం
మనసుపిండి యెదనునిండి నినుకోరెను సాంగత్యం
గృహప్రవేశ సమయాన అనునయంగ మనసుదోచి
నాకచేరి కొచ్చినావు ననుచూడగ మెచ్చినాను
నినువివాహ మాడుదునని నిర్భయంగ నేజెప్పగ
నాకిష్టమె గానీ పెద్దల అనుమతి ఒప్పంటివె
నీయింటికి మాయమ్మను రాయబారిగాపంపితి
మీఇంటీ పెద్దలంత సమ్మతించి మనకుమనువు
జరిపించిగ సిద్ధమైరి ఇకమనకూ ఆనందమె
సుఖజీవన సాగరాల పయనింపగ సంతోషమె

