మనిషి మనసు
మనిషి మనసు
దివియైనా కొరగాదొయ్ పానశాల లేనిచో
భువియైనా తిరగదోయ్ పానశాల లేనిచో
గుడియైనా బడియైనా పదిలంగా వున్ననూ
ఊరిపేరు ఉండదోయ్ పానశాల లేనిచో
గాలినీరు లేనిచోట బ్రతకగలరు మనుషులే
ఏప్రాణీ బ్రతకదోయ్ పానశాల లేనిచో
మనిషి మనసు కోపంతో కర్కశంగ మారినా
మనసన్నది కరగదోయ్ పానశాల లేనిచో
గాఢంగా ప్రేమించే శక్తినీకు వున్ననూ
వలపన్నది నిలవదోయ్ పానశాల లేనిచో
