మమతను పంచుదాం!
మమతను పంచుదాం!
మమతను పంచుదాం!
(వచన కవిత )
*******************
అమ్మ అత్తా ఒకటేనా? కాదు కూడదంటుంది మన సమాజం.
కొమ్మ కొమ్మకు మధ్యలో గొడవలే ఉంటాయంటుందీ సంఘం.
తన కొడుకును కొంగున కట్టుకుందని తగని మంట పుడుతుంటే.
తన వంటింటి సామ్రాజ్యాన్ని తన కోడలే కైవసం చేసుకుంటుంటే.
అత్తమ్మ చిన్నపిల్లపై అధికారాన్ని చలాయించాలనుకుంటుంటే.
చెత్తసీరియళ్ళను చూస్తూ చిత్రమైన తగాదాలు పెట్టుకుంటుంటే.
అహంకారంతో కోడలు తమ అత్తమ్మని హింసల పాలుచేస్తుంటే.
దహియించే బాధతో తమ వాళ్లంతా దుఃఖములో మున్గిపోతుంటే.
శాంతిమృగ్యమైన గృహములే సమర క్షేత్రాలను తలపిస్తుంటాయి.
కాంతి తరిగిన జీవితాలు కటిక చీకటిలో కలిసి కరిగి పోతుంటాయి.
ప్రేమను పంచ గలిగితే చాలు మనలో విడిపోని బంధమేర్పడుతుంది.
ధీమణులైన మహిళలు తాము దిగుళ్లను మరచి దిక్కులను గెలుస్తారు.
కొంత సంయమనంతో వనితలు కూర్మితో కార్యములు చేయగలగాలి!
వింత విషయం కాదమ్మా!ప్రీతితో కుటుంబసభ్యులను చూసుకోవాలి!
కలసి యుంటే కలదు సుఖంబనుచు కాంతలు ధిషణతో శోచించాలి!
కలతలు పడరాదంచు భామినులు కలకాలమనురాగంతో చరించాలి!
తమ బిడ్డల్ని చక్కగా పెంచుకుంటూ చక్కని చదువులు నేర్పించాలి!
మమతను పంచుతూ మహికి యాదర్శమై చరితలో నిలిచి పోవాలి!//
**********************
