STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

త్యాగమూర్తి

త్యాగమూర్తి

1 min
0

త్యాగమూర్తి.
(వచన కవిత)

***********************
అమ్మ ప్రేమయే సృష్టిలో నపురూపమైనది.
అమ్మ దేవత వోలె నిట తిరుగాడు చున్నది. 

జగతికి దీపమై దివ్య పథమును చూపిస్తుంది.
అగణితమైన ననురాగమును తా కురిపిస్తుంది.

సకల జీవరాశుల్లో మాతృమూర్తి నిలిచియుంది.
ప్రకృతి రూపమై ప్రపంచాన్ని కాపాడుకొంటుంది.

ప్రేగును త్రెంపి బిడ్డలకు తన ప్రాణాలనందిస్తుంది.
త్యాగమూర్తి తన యూపిరిని క్షీరంగా మార్చుతుంది.

తొలి గురువుగా మారి పిల్లలకు చదువు చెబుతుంది.
కలతల్లో కష్టాల్లో తోడుగా నిలబడి ధైర్యాన్నిస్తుంది.

దైవమా తల్లి ప్రేమను పొందగా ధరలో జన్మించాడు.
దేవత వంటి తల్లిని బిడ్డలు ప్రేమగా చూచుకోవాలి.

వృద్దాప్యంలో యున్న తల్లిదండ్రులను ప్రేమించాలి.
బుద్ధిమంతులై తనయులు పెద్దలను సేవించాలి.

తల్లిదండ్రుల ఋణమును తీర్చుట తనయుల ధర్మం.
చల్లగా నా పావన మూర్తుల సేవలో తరించితే పుణ్యం.//
************************


Rate this content
Log in

Similar telugu poem from Classics