జాణతనము
జాణతనము
జాణతనము
(వచన కవిత )
కళలు నేర్చిన కాంతలకు ధైర్యమే కలిమి పంట.
వలచిన వారిపై యధికారాన్నేకోరుకుంటారంట!
ప్రాణాధికమైన ప్రేమలో భీతి పొడసూపుతుంది.
జాణతనంలో కాసింత జంకు బయల్పడుతుంది.
తనకు మాత్రమే నన్నభావన తగవు పుట్టిస్తుంది.
మనసును చిన్నా భిన్నం చేస్తూ చిన్న బోతుంది.
అలకలో యనురాగానికి హద్దు లేదంటుంది.
నిలువునా ముంచి నెయ్యమంటూ చూస్తుంది.
గాఢమౌ యనురాగంలో గుర్తింపు కావాలంటుంది.
వీడిపోని బంధానికే విలువ నివ్వాలను కొంటుంది.
ఒక కైక మరియొక సత్య చూపినట్టి మార్గమిది.
తకరారు లెందుకు?తలయొగ్గితే స్వర్గమంటుంది.
ఇష్టమైన తరుణి కోసమిక్కట్లను పడగలగాలి!
కష్టమెదురైనా కలికి వెనుక నిలబడగలగాలి!
ప్రేమను మించినదీ ప్రపంచంలో నేముంటుంది?
భామ కోర్కెలను తీర్చటమే భర్త కర్తవ్యమంటుంది.//
జీవనగమనంలో చిలిపి తాగాదాలు వస్తుంటాయి.
కావలిస్తే పురాణాలను చదివి నీవు తెలుసుకోవోయి!//
