"మళ్లీ రావా"
"మళ్లీ రావా"


చేయిదాటిన ఓ చెలియా..
చెదిరిపోనిది నీ చెలిమి.
నీ పై ఇష్టం నిన్ను ఇబ్బంది పెట్టిన వేళ!
నా ఆవేదన నీకు వేధింపు గా మారిన వేళ!
ఆశగా నీకు దగ్గర అవ్వాలన్న ఆలోచనని అడియాశగా మార్చి
నీ ఆశయం కోసం దూరమవుతూ అనుభవిస్తున్న ఈ వేధనని
నీ దరికి చేర్చాలని
నా ఊహల్లో జీవించియున్న ఓ కలల కావ్యమా
నిలుపుకోనా మది నిండా నీ ఊసుల్ని
హత్తుకోనా యద నిండా నీ రూపాన్ని