STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

మిత్రమా

మిత్రమా

1 min
16

ఓడిపోయావని ఉరుకోకు గెలిచానని చలించిపోకు


అక్కడ ఏదో గనివిరుగాని సందేశం ఉందని అనుకోకు 

అది నువ్వు రాసిన రాతై ఉండాలనుకో..


పరిగెడుతున్న సమయాన గుండె భారంగా ఉందనుకోకు 

అది నువ్వు వేసి తొలి అడుగుకు రెట్టింపు అనుకో 

కాస్త కష్టంగా ఉందని జీవితాన్నీ బలి తీసుకోకు 

నువ్వు పడే కష్టం రేపటికి రెండింతలై విజయాన్ని గెలుసుకోవచ్చు..

 కాదు కూడదు అంటే నీ కలానికి పదునుపెట్టు


రాతను కవితగా మలుచు మరిచిపోకు మిత్రమా

 మన జీవితానికి మాటలతో సరిపెట్టకు 

కలానికి పదును పెట్టి నీ రాతను మార్చుకో 

నీ బంగారు భవితకు బాట వేసుకో..

మిత్రమా చివరగా నీ మనస్సుతో రాతను మొదలుపెట్టు 

ఆ రాతను కవిత్వంతో రుగ్మతలను తొలిగేట్టట్లు చేయ్

 మరవకు జీవితాన్నీ.. వదలకు ఈ స్వస్థలాన్ని..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics