STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మధువు రుచి

మధువు రుచి

1 min
2

ఏ గులాబి..పంచగలదు..నీ పెదవుల మధువు రుచి..!

ఏ జాబిలి..కురియగలదు..నీ చూపుల మధువు రుచి..!


మెరుపు పూల పుట్టిల్లే..అవును కదా నీ చెక్కిలి..

ఏ తారలు..అందించును..నీ తళుకుల మధువు రుచి..!


కలలవీధి మరుగుతున్న..జ్ఞాపకాల కావ్యమా..

ఏ వలపులు చూపగలవు..నీ తలపుల మధువు రుచి..!


సిగ్గుపడే సెలయేరుల ఒంపులలో నీ కళలే..

ఏ మొగ్గల దాగున్నది..నీ సొగసుల మధువు రుచి..!


అరకన్నుల సింగారమె..సింధూరము దిద్దేవా..

ఏ వెలుగులు చిమ్మగలవు..నీ పలుకుల మధువు రుచి..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance