STORYMIRROR

Kadambari Srinivasarao

Classics

4  

Kadambari Srinivasarao

Classics

మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

1 min
358

గడిచిన కాలం రేపిన గాయాలను

తలుచుకుంటూ కూర్చుంటే

రాబోయే రోజులు సుఖవంతమౌతాయా!


నిప్పుల్లా చెలరేగిన ముప్పులు

మంచు తాకిడికి ఆరిపోయి

స్వచ్ఛమైన నవ వత్సరం 

మొగ్గ తొడిగి వికసించే పుష్పం కావాలి


మానవ జాతి మనుగడకే

ముప్పు కల్పించిన 

కరోనా మహమ్మారిని

తరిమికొట్టిన శాస్త్ర విజ్ఞానపు

విజయ దుందుభి మోగాలి 


కడుపు నింపే రైతన్న

కడగండ్లు ముప్పేటలా

తొలగి నవకాంతుల

హాలికుడు దర్శనమీయాలి


ఇడుముల ఇరవై రెండు

ఒక పీడ కలగా ఇబ్బంది పెడితే

చిగురించిన కొత్త ఆశలకు

మధుర జ్ఞాపకంగా ఇరవైమూడు

మచ్చ లేని మహారాజుగా నిలవాలి



Rate this content
Log in

Similar telugu poem from Classics