STORYMIRROR

Jyothi Muvvala

Classics Inspirational Others

4  

Jyothi Muvvala

Classics Inspirational Others

మార్పు కోరి

మార్పు కోరి

1 min
322

నా మనసు ఎందుకో

ఈ రోజు చిన్నబోయింది

నా ఆలోచనలు మూగబోయాయి

నా ఊహలు ప్రవాహం ఆగిపోయింది

కలం కదలనంటున్నది

కావ్యం పలకనంటున్నది

ఏమైందో నా మనసుకి

అవేశం కట్టులు తెప్పుకొని

పలికే నా భావాలు

మౌనదిక్ష చేస్తున్నాయి

ధ్యానంలో నిమగ్నమైనవి

అలకల పాన్పుపై విహరిస్తున్నవి 

ఎందుకే మనసా నీకు నేనంటే 

అలుసా అని అంటే

కాదు... కాదు ఎన్నటికీ కాదు

నీలోని పొంగే భావాలే 

ఈ కవితల ప్రవాహాలు

కానీ ఏమిటి నీ కవితలోనీ లోపాలు

నిత్యం అవే అంశాలు లేదు ఏ మార్పులు

అద్దుతున్నావా కొస మెరుగులు

లోకంలో కొలువైనవి అంతుపట్టని 

కన్నీటి గనులు లోతైన వ్యదలు

సాగాలి నీ రచనలు కుంటుపడిన

సమాజానికి ధీటైన ప్రశ్నలు...!!


Rate this content
Log in

Similar telugu poem from Classics