STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మానసం

మానసం

1 min
217


ఉషస్సుతో ఉదయించే పిలుపులెన్నో

బంగారు పూతల బాటలో

వెండి తాపడాల మాయలలో

జిలుగు రంగుల తెరలలో

అఖండ జ్యోతిలా ప్రయాస వెలుగులు...


ఉత్సాహాల కోలాహాల సందడే

ఉన్నత ఉద్వేగాల తలపులే

అభూత కల్పనల తాండవములో

పైకి నవ్వుల దుప్పటి కప్పుకొంటూ...


పట్టపగలు బ్రతుకు తోటలో

చీకటి చిత్రాలు విచిత్రంగా అద్దేస్తూ

పేదోడి గోడు సునామీ హోరు

కమ్మిన వ్యధలు మనసు పుటలలో చెదలు...


సంస్కృతి సంప్రదాయాలు చెప్పట్లు

సమస్యల ముళ్ళ పందిరిలో ముచ్చట్లు

శిధిలమైన భావాజాలాల ముసుగులు

కాలదన్నిన మనోధైర్యాన్ని కసితీరా చూస్తూ..


ఆరిపోయిన వత్తుల్లా, కరిగిన క్యాండిల్ లా

రోధించే చీకటి బ్రతుకులే

శూన్యములో నీటి బొట్టులే

అప్పుడప్పుడు ఓ నవ్వు మెరిసిపోతుంది

మదికి జోల పాటైనట్టు....


 ఓ ఆనందము కొంత కాంతి జల్లుతుంది

వడలిన మోములో చిటికెడు తేజస్సు 

కష్టాల కొలిమిలో సానబెట్టినట్లు

నిప్పుల ఎండలో మంటల స్నానం చేసినట్టు

నీకు నీవే సానుభూతి నీరు పోసుకో...


కురవని వానకై ,గొంతు తడిపే నీటికై

కనిపించని ఆశ కై తెచ్చాడుతూ

రాజీ పడుతూ మనో కాన్వాసు కు

వెలిసిపోని రంగులను పులుముతూ..


జీవిత పోరాట యుద్ధంలో 

అమర వీరత్వం నీదంటూ

అడుగులు వేయాలి

ముళ్ళు ముళ్ళు తోనే తీస్తూ పోవాలి

కాళ్ళ కింద మట్టి తనువును కప్పు వరకు...


బానిస బ్రతుకు విముక్తి ఆకాంక్షిస్తూ

స్వేచ్ఛ ప్రపంచము వైపు అడిగేయాలి

అరుణ పతాకమే చైతన్యమంటూ

అలసిపోని వ్యక్తిత్వము నీదంటూ..

      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational