మాధవుడు
మాధవుడు
ప్రాసాక్షరి.
సససస, తతతత, మమమమ /
ఉత్పలమాలలు /
*మాధవుడు*
2.
వేసట కల్గివేడుకొన వేదన మాన్పగ నిల్చు బంధువై
దాసవిభుండు మాధవుడు దాంతుడు దైన్యవినాశకుండుతాన్
హాసము చిల్కుచుండె ఘనమౌ శిఖి పింఛ విలాసశోభతన్
వాసనలన్నియున్ దొలగు భక్తిగ పట్టిన వానిపాదముల్ /
2.
ఆతడె పద్మనాభుడట నాడుచు నుండెను గొల్లవానిగా
మాత యశోద యంచు కడు మన్నన చేయు వినమ్రశీలిగన్
భ్రాతట రేవతీ పతికి భక్తిగ సేవలుసల్పి పొంగుచున్
దాతగ సర్వమిచ్చి పరితాపము తీర్చును భక్తకోటికిన్ /
3.
ఆమని వేళలన్ సరసి కావల యొడ్డున సైకతంబులో
భామలకూడి యాడునట వన్నెల చిన్నెల పోటుగాడు మా
కామములెల్ల దీర్చువాడు కైటభహారి యశోధనుండు తాన్
సేమము నిచ్చువాడు సరసీరుహనేత్రుడు సుప్రకాశుడై //
