మా కన్నతల్లి
మా కన్నతల్లి
*శీర్షిక :మా కన్నతల్లి*
(ఉత్పల మాల పద్యములు)
శూరుల కన్నతల్లి ఘన శోభితమై వెలు గొందు ధాత్రి పొం
గారగ ధాన్య రాశులిట కాంచన సంపద తోడ నిండి సం
సారము నందు మేటి యన శాంతిని కోరెడి సాధుచిత్త మా
భారత మాత యున్నతిని పాడెద భక్తిగ సంతసంబుగన్.
ఆ రవి నిల్చు దాక దిశ లందున వెల్గును దేశ కీర్తి మా
భారత శాస్త్ర వేత్త లిట భవ్య జగానకు బాట వేయగా
సారస సౌమ్య సాంస్కృతిక సంపదతో విలసిల్లి వాసిగన్
తారక భాతి భాసిలును ధారుణి యందున శ్రేష్ఠ వర్షమై.
భారతి దేవి పుత్రులగు వాల్మికి వ్యాసుడు
కాళిదాసులున్
భారవి మాఘ శూద్రకుల పాణిని ముఖ్యల మార్గమందుచున్
సారమహాసుధా ఝరిగ సాహితి ధారలు పొంగి పొర్ల మా
భారత తత్త్వ సత్త్వ మది బంగరు జిల్గుల తేజరిల్లగన్.
భారత మాతకిచ్చెదము బంగరు పుష్పపు హారముల్ సదా
చారము తో మెలింగి మన సంస్కృతి నెల్లెడ నిల్పువారమై
భారత మాత గీతములు పాడుచు నుందుము భక్తితోడ సా
కారము కాగ మా కలలుగౌరవ మొప్పగ నిల్తుమీ భువిన్ //
--------------------------
