STORYMIRROR

Radha Krishna

Tragedy Classics Inspirational

4  

Radha Krishna

Tragedy Classics Inspirational

లిఖించుకున్న అక్షర సత్యాలు

లిఖించుకున్న అక్షర సత్యాలు

1 min
346

ఊహ మొదలైన క్షణం నుండి ప్రేమిస్తూనే ఉన్నా

ఎందరినో ప్రేమించా...

వయసు ప్రభావం ...చూసిన ప్రతి ఒక్కరిలో ..

అందరినీ ప్రేమించేంత సహృదయం...

ఎవరు పలుకరించినా...నాపై ప్రేమే అనే తెలియనితనం..

వారికి చిన్న బాధ కలిగినా ...నాకే కలిగినంత ఆవేదన..

అందరినీ గుడ్డిగా ఆరాధించడం...

కొందరు నువ్వు నాకు నచ్చలేదు అని ఛీ కొట్టినా..

మరో వ్యక్తి...ప్రేమకు..పెళ్లికి కాదు...

మరోదానికి నేను సిద్ధం..అవునంటే నీ ఇష్టం..

అని అవహేళన చేసినా...

అన్నింటా...ఓటమిని ..

చవి చూసిన మనసు...

విసిగి..వేసారిన వయసు...

ప్రేమ - పెళ్లి అనే పదాలపై

నమ్మకం పోయిన సమయం..

అంతా వట్టి భ్రమే అని తెలిపిన ...జీవిత సత్యం...

ఏమని చెప్పను...

ఎలా చెప్పను...

కనిపించించేదంతా ప్రేమ కాదనా...

కామించేదనా...

అవును...జీవిత అధ్యాయపు పుటలలో

లిఖించుకున్న అక్షర సత్యాలు..

సాక్షర చిహ్నాలు.

ప్రేమ అంటే..వ్యామోహం

............

(ఒక జరిగిన సంఘటనకు అక్షర రూపం)

✍️ Radha


Rate this content
Log in

Similar telugu poem from Tragedy