STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

లేత ప్రేమ

లేత ప్రేమ

1 min
308

వేడి వయసులో ఎదలోప్రేమ మురిపిమే

వాడి కోరికల వరవడికీ వలపు తిరిపిమే

లేత మనసుకి లేమ కూడినా తిరుణాలే

గీత దాటనూ చూపాలిలే లేని కారణాలే


జాము రాత్రి జావళితో కలిసి ఆ జాబిలి

గోముచేసి గోలచేసి గుట్టుగా చేరే కౌగిలి

మీరజాలలేదులే మిక్కిలి మక్కువతోనే

చేరగిలి చూపు మధురమే ఎక్కువతోనే

వేడి వయసులో ఎదలోప్రేమ మురిపిమే


ఎన్నో ఊసులు చెప్పుకుని ఎదురేచూసి

అన్ని ఊహలే అకస్మాత్తుగా బెదరిచూసి

కలగాపులగం చేసినే కనుల చూపుతోనే

కలవరించే తన్మయం కలిగే రూపు తోనే

ఆశలు పండే తరుణాన ఆలస్యమేలనో

శ్వాసలా ప్రేమనే భాసించ లాస్యమేలనో

వేడి వయసులో ఎదలోప్రేమ మురిపిమే

వాడి కోరికల వరవడికీ వలపు తిరిపిమే


నీడకూడ నిన్నే కలవరించే ప్రతినిమిషం

జాడకోరి జవరాలు లెఖ్ఖించే మీనమేషం

నీడకూడ నిన్నే కలవరించే ప్రతినిమిషం

జాడకోరి జవరాలు లెఖ్ఖించే మీనమేషం


వేడి వయసులో ఎదలోప్రేమ మురిపిమే

వాడి కోరికల వరవడికీ వలపు తిరిపిమే

లేత మనసుకి లేమ కూడినా తిరుణాలే

గీత దాటనూ చూపాలిలే లేని కారణాలే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance