కవితా పూరణం
కవితా పూరణం


29.02.2020 నాటి : కవితా పూరణం .
దత్తపాదం : " తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మఱి మీటేడిన్ "
పూరణం :
వినుము రసరమ్య శృతి కీర్తనల్ స్వరతరంగ లహరున్ {దేలు}
గనుము అశరీరవాణి సుందర సుమధుర గాత్రములన్
కినుక వహించకవాయిద్యయంత్ర సమ్మేళనబాణీలకున్
తనువులేదటచిత్రమే యువతంత్రుల( మఱి మీటేడిన్ ||
ప్రతిపదార్థము మఱియు భావము :
1. వినుము= వినండి ; 2. రసరమ్య = రమ్యమైన రసములతో నిండిన
3. శృతి కీర్తనల్ = శృతి లయ బద్ధమైన కీర్తనలను / పాటలను
4. స్వరతరంగా లహరులన్ = స్వరములచే కదిలేదు అలల ప్రవాహములపై తెలియాడెడు ;
5. గనుము = చూడండి. ; 6. అశరీరవాణి = ఆకాశవాణి ;
7. సుందర , సుమధుర = అందమైన , మధురమైన ;
8. గాత్రములచే = రాసాడోలలూగించు గొంతుకలతోని ;
9. కినుక వహించక = విసుగు చెందక/ కోపమును తెచ్చుకొనక
10. వాయిద్య యంత్ర = వివిధ సంగీత పరికరములు ;
11. సమ్మేళనం = స్వర సంయోగమున ;
12. బాణీలకున్ = రాగములచే అలవరుసలా పదలయ విన్యాసములకున్
13. తనువు లేదట = శరీరము కనిపించకుండునట
14.చిత్రమే = ఆశ్చర్య కరమైన విషయమే ;
15. యువ తంత్రులన్ = నూతన- వాయిద్యములకు ఉండే తీగలను
16. మఱి మీటేడిన్ = మరల మరల స్వరాలను పలికించే క్రమములోనిదని ఈ దత్త పాదము యొక్క భావము .
################## .