STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ

1 min
2


కుందనపు బొమ్మగ కనిపించినది నీవేనా 

అందమైన మైనాగా ఆకర్షించినది నీవేనా 

అనుకోకుండనే జరిగిందీ ఆవైపు వీక్షణం

అనేకమైన ఆలోచనలే మదిలోన తక్షణం 

మనసంత సుందర మందిరం మరులతో

సొగసంత సమీరమై వీచే వింజామరలతో 

ఎదురుగా నిలిచి ఎదతోనే పిలుపే పిలిచి

బదలుగా పలుకలేని మూగత్వమే వలచి 

ముసిమి మిగుల చేరి ముదం తానే పెంచి

పసిమిబంగారపు సోయుగంతో మరిపించి 

కలలోను కనులలోనూ కళకళలతో నిలిచి

తలలో యోచనల తన్మయత్వము అలిసి 

లేఖా కావ్యంగా లేఖనీయమైనే ఆ సొగసు

లేఖాహారునికి అర్పణచేయలేవా మనసు ....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance