STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

కుదిరేనా

కుదిరేనా

1 min
1

శక్తిలేక ప్రవాహాన్ని..ఆపేందుకు కుదిరేనా..!

భక్తిలేక దైవంగా..మారేందుకు కుదిరేనా..!


యుక్తియనగ మోసమనే..అర్థమేల చూస్తారో..

శ్రద్ధలేక మౌనంలో..మునిగేందుకు కుదిరేనా..!


పనికిరాని చింతనసలు..పరతత్వం ఎట్లగునో..

బద్ధకాన్ని పోషిస్తే..ఎదిగేందుకు కుదిరేనా..!


చదువంటే పుస్తకాల..కొలువులోన దొరికేదా..

హృదయవిద్య వేరొకరికి..నేర్పేందుకు కుదిరేనా..!


విజయమంటే విస్తరిలో..వడ్డించ బడదెవ్వరికి..

విశ్వాసపు చిరునామా..ఇచ్చేందుకు కుదిరేనా..!


Rate this content
Log in

Similar telugu poem from Classics