STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

కృష్ణార్జునులు

కృష్ణార్జునులు

1 min
3

కృష్ణార్జనులు //

(పద్యములు )


1.

ధ్రువకోకిల.


పరమపావన మూర్తులీ భువిఁ బాలనంతయు సేయుచున్

దురిత భావన కల్గు దుష్టుల దుర్గుణంబును ద్రోలుచున్

వెఱపు మాన్పెడి శౌర్యవంతులు ప్రేమ మీరగ కాచుచున్

ధరణి యందున కృష్ణ పార్థులు ధర్మమున్ నిల బెట్టగన్.//


2.

మత్తకోకిల.


భారతంబున యోధులిద్దరు వైరి సేనలఁ గూల్చుచున్

దీరు తెన్నులు మారిపోవగా త్రిప్పి కొట్టిరి దుష్టులన్

జేరి కొల్చిన వారి కెప్పుడు శ్రేయమెంతయొ కూర్చుచున్ 

గారు చీకటి లోన వెల్గిరి కాంతి నీయఁగ నీ ధరన్.//


3.

ధ్రువకోకిల.


గురువు శిష్యులుగా చరించిరి గుహ్య గీతను పల్కుచున్

దరతరంబులు నిల్చి యుండగ దాము చెప్పిన శాస్త్రముల్

మఱపు రానిది గీత యంచును మానితమ్ముగ నమ్మినన్

జిరయశంబును గల్గ చేయును చింతలన్నియు మాయమౌ.//


4.

మత్తకోకిల.


ముక్తి నిచ్చెడి గీత బోధలు మోహమున్ దొలిగించగా

శక్తి నిచ్చెడి కృష్ణ నామము సంతసంబుగ పల్కి సం

రక్తితో హరి సేవ చేయుచు పాదధూళిని దాల్చినన్

భక్తవత్సలు డాముకుందుడు బంధువై చరియించురా!//




Rate this content
Log in

Similar telugu poem from Classics