STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

కృష్ణ కుచేలులు

కృష్ణ కుచేలులు

1 min
254

తేటగీతి /


కృష్ణ -కుచేలులు /


చిన్ననాటి చెలుని గాంచ స్నేహితుండు 

కనుగొని కుచేలు డరుదెంచె కామితార్థి 

యగుచు కృష్ణుని గృహముకు సగుణ మతిగ.


చెలుని హస్తంబు గైకొని సేదదీర్చి

పలుకు పలుకున తేనెలన్ జిలకరించి

పసిడి సింహాసనంబున పట్టి నిలిపి

పాదపూజలన్ దాజేసె పావనుండు.


చిన్నతనమున జేసిన చిలిపి పనులు

చెప్పుకొనుచుండి నేస్తులు చేయి కలిపి

మురిసి పోవుచు సమయంబుఁ మఱచి రపుడు.


దైవమా శౌరి చెలునిపై దయను చూపి

సకల సంపదల నొసగంగ సంతసముగ

దాచియుంచిన

నటుకులన్ దాను మురిసి

తినగ మిత్రుని కష్టముల్ తీరెనపుడు.


స్నేహ మన్నది తీయనౌ సృష్టియందు

స్థాయి భేదము లేనిది సఖ్యమొకటి

సాహచర్యమొసంగును జయము నెపుడు.

కలిసి యున్నట్టి వారలు కలత మఱచి

భావికాదర్శమై ప్రజ బ్రతుక వలయు.//


Rate this content
Log in

Similar telugu poem from Children