వెలుగు దివ్వెలు
వెలుగు దివ్వెలు
1 min
367
పచ్చని తరువుకు పూచిన పూవులా...
స్వేచ్ఛగా రెక్కలారుస్తు నింగిన ఎగిరే గువ్వలా..
అనురాగపు చమురుకు మండే వెలుగు దివ్వెలా..
విశ్వానికి అంతుచిక్కని విజ్ఞానపు ఖనిలా..
కలలను సాకారం చేసుకునే కలాం
వారసుల్లా..
నచ్చినట్టుగా మలచుకునే మైనపు ముద్దలా..
మాకు మేముగా ఎదిగే స్వేచ్ఛ ను మాకివ్వండి..
మీ ఆశలు ఆశయాలు మాపై రుద్దకండి..
భావి భారత పౌరులమన్న నెహ్రూ వాక్కును నిజం చేయనీయండి..
స్వశక్తులుగా ఇలలో కాంతులను పంచనివ్వండి...