STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కప్పు తేనీరు

కప్పు తేనీరు

1 min
2

కప్పు తేనీరు 


సెలవ రోజని నేడు చింతలన్నియు మరచి 

తలపులో కలలనే తన్మయముగా తలచి 


బద్ధకముగా నేను పడకపై దొర్లుతూ 

ప్రొద్దున్నే లేవక ముసుగేసి నిక్కుతూ 


హాయిగా నేనుండ నప్పుడే శ్రీవారు 

తీయనౌ పలుకుతో తెరలనే తీశారు.


సూరీడు వెలుగుతో చురచురా చూడగా 

బారెడు పొద్దటంచు భయముతో లేవగా


కప్పులో తేనీరు కలుపుకొని మా వారు 

అప్పుడే తెచ్చి నా హస్తమున నుంచారు 


ఘుమఘుమల తేనీరు గోముగా మావారు 

మమతలను కలుపుతూ మరిగించి తెచ్చారు 


సెలవ రోజున మగడు చిన్నపని చేయంగ 

వలపు రాగామృతము వర్షమై కురియంగ


త్వరత్వరగ లేచి పనులన్ని చేశాను 

మురిపాలు చిలుకుతూ పొద్ధంత గడిపాను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics