కొత్త వాతావరణం
కొత్త వాతావరణం


ప౹౹
కాపాడుకొందామ అందరం పర్యావరణం
పాడుచేసుకుందామా౼మిగిలేది ఓ రణం ౹2౹
చ౹౹
భూగోళంలో ప్రతిదీనూ మితమూ కనుక
ప్రతీ గళం విప్పి వివరము చెప్పాలి ఆనక ౹2౹
గాలి కాలుష్యాన్ని అదుపులోన ఉంచాలి
కాసారపు నీటి శుభ్రతనూ బాగా పెంచాలి ౹ప౹
చ౹౹
మానావాళి ముప్పునే ముందే గ్రహించాలి
జనావళి క్షేమానికి భాధ్యతను వహించాలి ౹2౹
ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను పరిహరించాలి
ప్రమోదకరమైనవి వాడేసి సహకరించాలి ౹ప౹
చ౹౹
విషరసాయనాలను పంటలకు ఆపేద్దాము
మిషన్ నూనెలను మిగులుగ వదిలేద్దాము ౹2౹
పాత పధ్ధతులకు మరల తరలే వెళదాము
కొత్త వాతావరణాన్ని మనము సృష్టిద్దాము ౹ప౹