కొత్త జీవితం
కొత్త జీవితం
కొత్త జీవితం కొత్త కలల్నించి పుడుతుందికొత్త కలలు
కొత్త ఆలోచనలనించి పుడతాయి
ఆకాశం నించి తెరచాప వేళ్లాడినట్టు అటక మీద జాబిల్లి
దాక్కున్నట్టు అల్లిబిల్లిగా హత్తుకున్నవేవేవో కలలు దూరాల్ని
దారాలుగా మార్చేవేవేవో ఆలోచనలు
ఉన్నదొక్కటే జీవితంపది జీవితాల పెట్టుపడే ప్రతీ సారీ
వెయ్యేనుగుల బలంతో లేవనిచ్చేప్రతీ కొత్త ఆలోచన వెనకా
సాధించనిదేదో
కలల్లోనూ నూగై గుచ్చుకునే పట్టుదలేదోరప్పున రగిలి దహించే
కసి మంటేదో అవమానపు గతమేదో కన్నీటి ప్రాయాల్ని
కళ్ల ముందు నుంచి చెరిపివేయనివ్వని కొరివేదో
‘కొత్త ‘ జీవితానికి ప్రాణ ప్రతిష్ట చేస్తుందికథ ఎక్కడ మొదలైనా
చివరికి మిగిలే అందమైన జ్ఞాపకమేదోచుక్కానై నడిపించే వేళ
చెదరని చిరునవ్వు హృదయాన పాతుకున్న బాధల ఊట బావి నించే
పచ్చని మొక్కైమొలకెత్తకేం చేస్తుంది!
ఎక్కడున్నా ప్రేమించే అదృశ్య హృదయమేదోవెన్ను నిమిరే వేళ
విజయాలహర్షాతిరేకపు జల్లు కురవకేం చేస్తుంది!!
