కొత్త బాట
కొత్త బాట
కలలు లేకపోతే మనస్సుకు చైతన్యమెక్కడుంటది?
ఊహలు లేకపోతే ఉత్సాహమక్కడుంటది?
కలలు ఊహలు బతుకు పగలుకు వేగుచుక్కలు
ఊహలు పేర్చుకుంటూ ఖగోళాలను చుట్టివస్తం
నిలబడ్డ నేలను బతుకు విహంగంగా ఎగిరిస్తం
ఊహలతో నడకకు కొత్త బాటను
కని పెడ్తం
పర్వత శిఖరాలను అందుకునే ప్రయాణానికి నాందీ గీతం పాడుతం
సముద్రాల్ని చూస్తూ బతుకుకు సముద్ర గాంభీర్యాన్ని నేర్పిస్తం
బతుకులో పేరుకుపోయిన ఉప్పు నీటిని మంచి నీటి ప్రవాహంగా మార్చుతం
బతుకు దాహాన్ని తీర్చుతం
కలలు లేకపోతే ఆకాశాన్ని తాకలేం
బతుకుప్ర₹యాణానికి నాందీ గీతం పాడలేం
ఊహలు ఉబుసు పోకకు వచ్చేవి కావు
కలలు రాబోయే గలగలలకు భూమికలు
ఊహలు మార్పు చైతన్యానికి వాహికలు
కలలు ఊహలు బతుకు సైన్సుకు ప్రయోగాలు
ఏది ఏమైనా విధాతకు సలాం
