కోరుకుంది ప్రేయసి
కోరుకుంది ప్రేయసి
నీ నవ్వుల మల్లెల'నే..కోరుకొందు ప్రేయసీ..!
మనసుతప్ప మరి ఏమిటి..ఇచ్చుకొందు ప్రేయసీ..!
కరిగిపోవు వసంతాలు..వాడిపోవు వలపులే..
చెలిమినిధే యుగయుగాలు..నిలుపుకొందు ప్రేయసీ..!
నీ చెక్కిలి సిగ్గుపూల..పరిమళాలు మధురమే..
వ్రాయబడే గజలుసుధన..నింపుకొందు ప్రేయసీ..!
గుండెగుడిని కొలువు తీరి..నడిపేవా నా నావ..
నీ దయతో తీరమేదొ..చేరుకొందు ప్రేయసీ..!
నీ అడుగుల జాడ మించి..వెన్నెలింటి దారేది..
నీ చూపుల నీడలలో..ఆడుకొందు ప్రేయసీ..!

