కోరిక
కోరిక
ఎలా పుట్టానో ఎలా పెరిగానో తెలియదు నాకు,
నాలుగు రోజుల బ్రతుకైనా
ఆకలి తీర్చే తరువుగా మనసున నిలిచిపోతాను.
బ్రతుకులోని మాధుర్యాన్ని చూడలేను నేను,
అనుభూతుల వ్యధల కథలు చెప్పలేను నేను,
వసంతాల వేడుకను చూడలేని దానను,
నిత్య చావు భయంతో శోకజలధిలో మునిగిపోతున్నాను,
చరిత్రలో మిగిలిపోవు
అందాల ప్రదేశంకు
తరిలించమని దేవుడిని కోరుతున్నాను.
బృందావన సీమలో
రాధాకృష్ణుల ప్రేమరాగానికి శ్రుతి లయ నేనే అవుతాను,
నేలతల్లికి నుదుటముద్దే
నూటన్ సిద్ధాంతమని చెబుతాను,
ఆరోగ్య వరప్రదాయినిగా
అలరించు ముచ్చటలో వుండిపోతాను,
రైతన్న కలలపంటగా
వేదనలను వెలివేసే
బ్రతుకు చాలంటాను.
