STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కోమలియే

కోమలియే

1 min
281

కట్టబడిన తాళిసాక్షి..కట్టుబడిన కోమలియే..! 

వ్రాయలేని ప్రేమలేఖ..దాచుకొనిన కోమలియే..! 


నేను కాని నాదికాని..నాకోసం ముస్తాబులు.. 

చెప్పుకోను ఏమిలేక..చెఱచేరిన కోమలియే..! 


వల్లకాని అభిమానము..మోసేనా ముచ్చటగా.. 

సాధించగ ఆశించదు..ప్రేమించిన కోమలియే..! 


నిప్పులపై నడిచేనా..మంటలనే మింగేనా.. 

తను మధువై మిగిలేనా..మైమరచిన కోమలియే..! 


కడలినడుమ కలలనావ..పయనమెటుగ సాగేనో.. 

నేను-నాది సంగతులే..విడనాడిన కోమలియే..! 


కాలమిచ్చు జవాబులను..స్వీకరించు మహరాణిరొ.. 

ఆశపడే ముచ్చటలకు..సెలవిచ్చిన కోమలియే..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance