Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ఈవని రవిశంకర శర్మ

Romance

4.5  

ఈవని రవిశంకర శర్మ

Romance

కనుపాపల్లో ..!

కనుపాపల్లో ..!

1 min
336


తెలుగు పడుచు వలె ఉన్న ఆమె ,

తనముందే తిరిగే

అతనిని రోజూ చూస్తుంది .

నీలిమేఘశ్యాముడిలా ముఖం ,

ప్రకాశవంతమైన కనులద్వయం .

ఇంపైన వస్త్రధారణ ,

రాకుమారుని నడక .

ఔన్నత్యాన్ని ఒలికించే మాటతీరు ,

సభ్యత కలిగిన వానిజోరు .

ఆమెను ఆకట్టుకున్నాయి .

సూర్యుని లేలేత కిరణాల వలె ,

జాబిలి చల్లని వెన్నెల ఓలె ,

ప్రశాంతమైన సాగర అలల వలె ,

నదిలోని స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఓలె

అతనితో జీవితం సాగుతుందని

భావించిన ఆమె , అతనిని

గాఢంగా ప్రేమించింది ;

ఒకరోజు ఆమె స్వప్నం సాకారమైంది .

ఇరువురి వలపు కలగలుపుగా

చూపరులకు ముచ్చటగొలిపింది ;

కనుపాపల్లో ఒకరికొకరి రూపం ,

ఆనందభాష్పాలను నింపింది .

******************



Rate this content
Log in