కనుపాప
కనుపాప
కనుపాపల నిదురపుచ్చు..రెప్పలపై ఉన్నావుగ..!
మెలకువకే మెలకువైన..రెక్కలపై ఉన్నావుగ..!
నీ చెలియగ జన్మలెన్ని..ఎత్తానో ఏమోలే..
ఈ ఖాళీ మధుపాత్రకు..నవ్వులపై ఉన్నావుగ..!
ఆకారం ప్రాకారం..భళ్ళుమనే వేళ వేడ్క..
ఎగిరిపోవు చిలుకతోడు..దివ్వెలపై ఉన్నావుగ..!
చిత్తరువు ఈ తనువను..రుజువేదో చూపేవా..
గగనాలను ముద్దాడే..మబ్బులపై ఉన్నావుగ..!
పరుగులిడే యౌవనమే..వనమనుకొని మురిశానే..
అసలు లేని కాలానికి..పువ్వులపై ఉన్నావుగ..!

