STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కనులభాష

కనులభాష

1 min
3

కనులభాష చదవడమే..నేర్పమందు కొంచెం..!

ప్రేమగాయమింత మాన్ప..చూడమందు కొంచెం..!


సాహసమే చేయలేని..బేలతనం దేనికి..

కలనైనా తలనునిమిరి..వెళ్ళమందు కొంచెం..!


తపస్సులో ఉన్నానని..చెప్పలేను నిజమే..

నా తపనల మంటపట్టి..ఆర్పమందు కొంచెం..!


అసలెందుకు బ్రతకాలో..బ్రతుకర్థం తెలియక..

ప్రశ్నించే మనసుగొడవ..తీర్చమందు కొంచెం..!


లేఖ ఒకటి వ్రాయాలను..తలపుకూడ బరువే..

దూరాలను తెంచుదారి..చూపమందు కొంచెం..!


ఏ మంటకు తెలిసేనట..అసలువిరహ సౌఖ్యం..

బాధలేని లోకానికి..చేర్చమందు కొంచెం..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance